CM Chandrababu: లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన సీఎం..! 22 d ago
అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. నెమకల్లులో చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు తమ గ్రామానికి రావటంతో నెమకల్ల వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు గ్రామసభలో పాల్గొననున్నారు.